ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN ఎఫెక్ట్: కుమారుడి వ్యవహారంపై వనమా బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-01-06T21:10:13+05:30

నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో వనమా రాఘవేంద్రపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో వనమా రాఘవేంద్రపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని చెప్పారు. రాఘవ ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చాయి. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడని రామకృష్ణ తెలిపాడు.  ‘‘నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నా భార్యను హైదరాబాద్ తీసుకుని రమ్మని రాఘవ చెప్పాడు. నీ భార్యను నా దగ్గరకు పంపు.. లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నీకు రాదు.. నిన్ను ఎవరూ కాపాడలేరు. అందుకే ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా. నాకు నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తిని అమ్మి ఎవరికీ అన్యాయం జరగకుండా అప్పులు చెల్లించండి. నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి నా తల్లి, అక్క సైతం వేధింపులకు పాల్పడ్డారు’’ అని తెలిపాడు.


వనమా రాఘవ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో తాజా పరిస్థితిపై హైకమాండ్‌ ఆరా తీసింది. రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్‌తో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.  రాజీనామాకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వనమాను పక్కన పెట్టాలని టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-06T21:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising