ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో హన్మకొండ రికార్డ్

ABN, First Publish Date - 2022-02-02T20:58:28+05:30

టినేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలోనే రికార్డును సొంతం చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టినేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలోనే రికార్డును సొంతం చేసుకుంది. 15 నుండి 17 సంవత్సరాల టినేజర్ల కు 100 శాతం పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి రాష్ట్రంలో తొలి జిల్లాగా రికార్డు సాధించినందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య ను, హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని, జిల్లా అధికారులను, సిబ్బందిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. 


కరోనా కట్టడిలో భాగంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15 నుండి 17 ఏళ్లు వారికి వ్యాక్సిన్ పంపిణీ 100 శాతం పూర్తి చేసుకున్న జిల్లా గా రికార్డు సాధించింది. జిల్లాలో 55 వేల 694 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యాన్ని అధిగమించి 56 వేల 291 మందికి (101%) వ్యాక్సిన్ వేశా రు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

Updated Date - 2022-02-02T20:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising