ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి: దాసోజు శ్రవణ్

ABN, First Publish Date - 2022-03-19T23:08:10+05:30

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐసీసీ అధికార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిది ఏళ్ళుగా ఉద్యోగాల కోసం యువత ఆశగా ఎదురుచూసిందన్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా యువత ఉందని ప్రశాంత్ కిషోర్ సర్వే చెప్పిందన్నారు. ఈ రోజు నుండే 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తున్నాయని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారని, కానీ ఈ రోజు వరకు ఒక్క  ఉద్యోగ ప్రకటన రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీపై సమీక్షలో  సీఎస్ చెప్పిన మాటలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడమేనన్నారు. కొన్ని ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు , మరికొన్ని బోర్డుల ద్వారా నింపుతామని  చెబుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఉధ్యోగాలు ఇచ్చేందుకు బోర్డులకు అప్పగించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు.


300 మంది పనిచేసేటీఎస్‌పీఎస్సీలో కేవలం 80 మంది పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీని టీఎస్‌పీఎస్సీ ద్వారానే జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్డులు అంటేనే అవినీతి అని ఆయన అన్నారు. నిరుద్యోగుల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి నియోజకవర్గల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కోచింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. 40 లక్షల మందికి ప్రభుత్వం నుంచి స్టడీ సెంటర్ల ద్వారా కోచింగ్ ఇవ్వకుండా ఎమ్మెల్యేల ద్వారా ఎందుకు ఇప్పిస్తున్నరని ఆయన ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతి 3వేలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు సెక్టార్లలో 90 శాతం ఉధ్యోగాలు  స్థానికులకే ఇవ్వాలన్నారు. బిస్వాల్ కమిటీలో చెప్పిన లక్షా 91 వేలల్లో మిగిలిన లక్ష ఉద్యోగాల గురించి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-03-19T23:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising