ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీకి కొవిడ్‌ దెబ్బ!

ABN, First Publish Date - 2022-01-20T08:17:52+05:30

రాష్ట్రంలో కరోనా ప్రభావం ఆర్టీసీపై పడిం ది. పండుగ వేళ కళకళలాడిన బస్సులు కాస్తా.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రయాణికులు లేక బస్సుల రద్దు.. 

  భారీగా తగ్గిపోతున్న ఆదాయం

హైదరాబాద్‌, జనవరి19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ప్రభావం ఆర్టీసీపై పడిం ది. పండుగ వేళ కళకళలాడిన బస్సులు కాస్తా.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. బుధవారం నుంచి సాధారణ షెడ్యూల్‌లోని బస్సుల్లో కూడా 20 నుంచి 25 శాతం మేర తగ్గించి నడుపుతోంది. తెలంగాణ జిలాల్లోని వివిధ ప్రాంతాలకు రోజూ సుమారు 6,200 బస్సులు తిరుగుతుండగా.. బుధవారం నుంచి వీటిని 5వేలకు పరిమితం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 2,800 సిటీ బస్సులు తిరుగుతుండగా.. 500 నుంచి 600 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పండుగలకు ఊర్లకెళ్లిన వారు అధిక శాతం సోమవారానికే హైదరాబాద్‌కు వచ్చేయడంతో  ఆరోజు ఆర్టీసీకి రూ.12.21 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఆ తర్వాతి రోజు నుంచే ఆదాయం గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌ సిటీలో సాధారణంగా రోజుకు సుమారు రూ. 3 కోట్లు ఆదాయం వస్తుండగా.. నాలుగైదు రోజుల నుంచి ఆదాయం రెండు కోట్లు కూడా మించడం లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల కు కూడా డిమాండ్‌ లేక పోవడంతో.. రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-20T08:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising