ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం జాతరపై తర్జన భర్జన!

ABN, First Publish Date - 2022-01-21T08:18:02+05:30

మేడారం జాతరపై తర్జన భర్జన!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/భూపాలపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి సరిగ్గా 25 రోజులే మిగిలిఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతర కోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం, పొరుగు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తుండడంతో జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. వచ్చే నెల 16 నుంచి 19 వర కు నాలుగు రోజులపాటు జాతర నిర్వహణకు సంబంధించి.. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమావేశంలో తుది ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతించడమా? లేదా క ఠిన ఆంక్షలు విధించడమా? అన్నది ఆ రోజే తేలనుంది. గత వారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల్ని అనుమతించలేదు. అలాంటిది.. నాలుగు రోజుల జాతరకు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వహణ ఎలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా నుంచి కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా. వచ్చి, పోయే వారిని మినహాయించినా ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో లక్షల మంది గుమిగూడే అవకాశం ఉంటుంది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించినా... అమ్మవార్ల దర్శనానికి భక్తులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి ఉంటుంది. మహా జాతరలో భౌతిక దూరం పాటించడం సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో జాతర నిర్వహణపై గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య, దేవాదాయశాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది.


మేడారం ట్రస్టు బోర్డుకు ట్రబుల్‌

మేడారం మహా జాతరకు సమయం సమీపిస్తున్నా.. ట్రస్టు బోర్డు కమిటీని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. జాతరకు ఆరు నెలల ముందే దరఖాస్తులు స్వీకరించాల్సిన దేవాదాయ శాఖ.. ఇప్పటికీ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈసారి కూడా పునరుద్ధరణ కమిటీతోనే జాతరను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-21T08:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising