ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: పీడీయాక్ట్ తొలగించి బెయిల్ మంజూరు చేయండి: రాజాసింగ్ భార్య

ABN, First Publish Date - 2022-09-07T01:07:46+05:30

Hyderabad: గోషామహల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు బెయిల్‌‌ మంజూరు చేయాలని ఆయన భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తమ మనోభావా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: గోషామహల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ (Raja Singh)కు బెయిల్‌‌ మంజూరు చేయాలని ఆయన భార్య ఉషాబాయి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ కొందరు నిరసన వ్యక్తం చేయడంతో రాజాసింగ్‌పై పీడి యాక్టు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఉషాబాయి తన భర్తపై అనవసరంగా పీడీ యాక్టు నమోదు చేశారని హైకో్ర్టులో పిటిషన్ వేశారు. అందులో లా అండ్‌‌ ఆర్డర్‌‌ వింగ్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, హైదరాబాద్‌‌ సిటీ పోలీస్‌‌ కమిషనర్, చర్లపల్లి జైల్‌‌ సూపరింటెండెంట్‌‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఉషాబాయి పిటిషన్‌పై  హైకోర్టు మంగళ్‌హాట్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ .. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-09-07T01:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising