TS News: న్యూ ఇయర్ వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు
ABN, First Publish Date - 2022-12-31T19:03:17+05:30
Hyderabad: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో ఈ రోజు రాత్రి 11 నుంచి రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు అన్ని ఫ్లై ఓవర్లు మూసి
Hyderabad: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో ఈ రోజు రాత్రి 11 నుంచి రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు అన్ని ఫ్లై ఓవర్లు మూసి వేస్తున్నామని తెలిపారు. నెహ్రూ ఓఆర్‌ఆర్‌పై కేవలం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే వెహికిల్స్‌ను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 8 నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు చేస్తామన్నారు. 750 నుంచి 800 మంది పోలీస్ సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10వేల జరినామాతో పాటు 6 నెలలు జైలు శిక్ష విధిస్తారని, ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని ప్రాంతాలను మానిటరింగ్ చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
Updated Date - 2022-12-31T19:03:19+05:30 IST