ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSR సువర్ణ పాలనను ప్రజలు గుర్తించారు: Sharmila

ABN, First Publish Date - 2022-07-08T21:41:07+05:30

టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సూటిగా ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సూటిగా ప్రశ్నించారు. లోటస్పాండ్లో వైఎస్సార్‌టీపీ (YSRTP) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీపీ పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ను స్మరించుకోవడానికి హైదరాబాద్లో సెంటు భూమి కూడా లేదా? అని ప్రశ్నించారు. షర్మిల వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపను... ప్రతి గుండెను తాకిందని చెప్పారు. వైఎస్సార్ సువర్ణ పాలనను ప్రజలు గుర్తించారని తెలిపారు. వైఎస్ సేవలను ప్రభుత్వాలు మాత్రం గుర్తించలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా వైఎస్సార్ సువర్ణపాలన అందించారని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వైఎస్ సేవలను విస్మరించాయని షర్మిల మండిపడ్డారు.


సరిగ్గా గత ఏడాది జూలై 8న వైఎస్సార్ టీపీని షర్మిల స్థాపించారు. పార్టీ స్థాపించిన తొలి రోజు నుంచి షర్మిల అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతాంగం కోసం పరామర్శ యాత్ర, చిన్నారులపై లైంగిక దాడుల సందర్భంగా నిరసనలు.. ఇలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాలనుషర్మిల గట్టిగా నిలదీస్తున్నారు. 3500 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించి 116 రోజుల్లో 1500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసిన షర్మిలకు గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా చేసిన వాగ్దానాలలో వేటినీ పూర్తి చేయని విషయాన్ని ఆమె ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-07-08T21:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising