కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీఆర్ఎస్ బృందం
ABN, First Publish Date - 2022-10-06T15:45:17+05:30
ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. పార్టీ పేరును మార్చుతూ
ఢిల్లీ : ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. పార్టీ పేరును మార్చుతూ నిన్న పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని నేతలు తెలియజేయనున్నారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బృందం కలవనుంది. 'తెలంగాణ రాష్ట్ర సమితి'ని 'భారత రాష్ట్ర సమితి'గా మార్చుతూ టీఆర్ఎస్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. పేరు మార్పునకు ఆమోదం తెలపాలని వినోద్ కుమార్ బృందం కోరనుంది. వినోద్ బృందంలో పలువురు న్యాయవాదులు కూడా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
Updated Date - 2022-10-06T15:45:17+05:30 IST