ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sinhaకే మా ఫుల్ సపోర్ట్ : KTR

ABN, First Publish Date - 2022-06-27T15:42:20+05:30

రాష్ట్రపతి(President) అభ్యర్థిపై టీఆర్ఎస్(TRS) మౌనం వీడింది. తమ సపోర్ట్ ఎవరికో ట్విటర్(Twitter) వేదికగా చెప్పేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : రాష్ట్రపతి(President) అభ్యర్థిపై టీఆర్ఎస్(TRS) పార్టీ మరోమారు తమ మద్దతును స్పష్టం చేసింది. తమ సపోర్ట్ ఎవరికో ట్విటర్(Twitter) వేదికగా కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yeshwanth Sinha)కు తమ పార్టీ మద్దతు ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ‘‘భారత రాష్ట్రపతి ఎన్నిక విషయమై శ్రీ యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. మా పార్లమెంటు సభ్యులతో పాటు, నేను ఈ రోజు నామినేషన్‌లో టీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తో ‘జడ్’ కేటగిరీ సాయుధ భద్రతను కల్పించింది.యశ్వంత్ సిన్హా వచ్చే గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కేంద్ర మాజీమంత్రి సిన్హాను జూన్ 21వ తేదీన ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన తర్వాత, యశ్వంత్ సిన్హా పేరు వెలుగులోకి వచ్చింది. గత మంగళవారం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైన సిన్హా పార్టీ పదవికి రాజీనామా చేశారు.




Updated Date - 2022-06-27T15:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising