ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్న డీఎస్

ABN, First Publish Date - 2022-01-16T21:17:24+05:30

టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌ సొంత గూటికి రాబోతున్నారు. కారు దిగి ‘చేయి’ పట్టుకోబోతున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌ సొంత గూటికి రాబోతున్నారు. కారు దిగి ‘చేయి’ పట్టుకోబోతున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది  రాజకీయంగా డీఎస్‌ ఎదుగుదలంతా కాంగ్రెస్‌ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ కాంగ్రెస్‌‌లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌ డీఎస్‌ ఇంటికి వెళ్లి డీఎస్‌ను పరామర్శించారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు.

Updated Date - 2022-01-16T21:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising