ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్‎లో TRS-BJP కార్యకర్తల మధ్య వార్..

ABN, First Publish Date - 2022-02-19T17:15:33+05:30

జిల్లాలోని దర్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు పార్టీ కార్యకర్తలతో వెళ్లడానికి బీజేపీ ఎంపీ అర్వింద్ సిద్ధమయ్యారు. అయితే.. అర్వింద్‎ను టీఆర్ఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ : జిల్లాలోని దర్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు పార్టీ కార్యకర్తలతో వెళ్లడానికి బీజేపీ ఎంపీ అర్వింద్ సిద్ధమయ్యారు. అయితే.. అర్వింద్‎ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. వారికి పోటీగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటచేసుకోవడంతో దర్పల్లిలో భారీగా పోలీసుల మోహరించారు. శివాజీ విగ్రహాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఆవిష్కరించి తీరుతామని చెప్పగా..  పోలీసులు మాత్రం అనుమతి లేదని చెబుతున్నారు. అయితే.. పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని.. ఇలా చేయడం ఎంతవరకు సబబు అని అర్వింద్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2022-02-19T17:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising