ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress charge sheet: టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల చేసిన రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-09-03T21:54:30+05:30

టీఆర్ఎస్, బీజేపీ (TRS BJP) వైఫల్యాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చార్జ్‌షీట్ విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ (TRS BJP) వైఫల్యాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్‌వి అవకాశవాద రాజకీయాలని మండిపడ్డారు. మతం పేరుతో బీజేపీ, టీఆర్ఎస్‌ వైషమ్యాలు రెచ్చగొడుతున్నాయని తప్పుబట్టారు. రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుంది? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను కేసీఆర్‌ అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని నిలదీశారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎవరికి అమ్ముడుపోయారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి ఏడాది పాటు వజ్రోత్సవాలు నిర్వహించేలా.. కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో చేసిందని తెలిపారు. మునుగోడు ప్రజలు లక్ష ఓట్లు వేసి గెలిపిస్తే.. రూ.22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయే నేతలకు రూ.40 లక్షలు వచ్చాయని, అమ్ముడుపోయే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


Updated Date - 2022-09-03T21:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising