ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీహెచ్‌ ఇంటిపై దాడిని ఖండించిన రేవంత్

ABN, First Publish Date - 2022-04-14T15:16:48+05:30

మాజీ ఎంపీ వి.హనుమంతరావు రావు ఇంటిపైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ఎంపీ వి.హనుమంతరావు రావు ఇంటిపైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి పట్ల రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షీణిస్తున్నాయన్నారు. దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వి.హనుమంతరావు ప్రజల మనిషి అని,  ఎవరికి ఆపద వచ్చినా ముందుంటారని అలాంటి వ్యక్తిపై దాడి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలన్నారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 


కాగా...హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు, కారు ధ్వంసమైంది. 

Updated Date - 2022-04-14T15:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising