ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడిస్తున్నారు: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-01-19T23:18:44+05:30

రాష్ట్రంలో బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్‌ను ముట్టడిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన హర్షవర్ధన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో ఎంతో అవసరం ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకి వ్యతిరేకంగా 317 జీవో తీసుకొచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వం ఆయన ఆరోపణలు చేశారు. స్థానికులను స్థానికేతరులుగా మార్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 317 జీవో వల్ల ఉద్యోగుల భవిష్యత్ చీకట్లోకి వెళుతుందన్నారు. వీటిపై పోరాటం చేయాలని  ఉద్దేశంతోనే కాంగ్రెస్‌లోకి హర్షవర్ధన్ వచ్చారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో హర్షవర్ధన్‌కు గుర్తింపు ఉంటుందన్నారు. 


బీజేపీలో బండి, గుండు కలసి తమకు అధికారం ఇస్తే 317 జీవో రద్దు చేస్తామంటున్నారన్నారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ఈ జీఓ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కలం పోటుతో జీవోని ఆపివేయచ్చని ఆయన తెలిపారు. ఈ నాటకంలో పాత్రధారులు టీఆర్‌ఎస్,  సూత్రధారులు బీజేపీ అని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాలు చేస్తామని ఆయన ప్రకటించారు. తాము ఏ కార్యక్రమం చేస్తున్నా కోవిడ్ నిబంధనల పేరుతో  పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. 

Updated Date - 2022-01-19T23:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising