నేడు హైదరాబాద్ నుంచి మదురైకి ప్రత్యేక రైలు
ABN, First Publish Date - 2022-05-19T08:10:23+05:30
హైదరాబాద్ నుంచి మదురైకి గురువారం వేసవి ప్రత్యేక రైలును వేశారు. హైదరాబాద్-మదురై(07253) మే 19న, తిరుగు ప్రయాణంలో..
సికింద్రాబాద్/ హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి మదురైకి గురువారం వేసవి ప్రత్యేక రైలును వేశారు. హైదరాబాద్-మదురై(07253) మే 19న, తిరుగు ప్రయాణంలో.. మదురై-సికింద్రాబాద్(07254) రైలు మే 20న బయలుదేరతాయని అధికారులు తెలిపారు. ఇవి సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, వృద్ధాచలం, అరియార్, శ్రీరంగం, తిరుచిరాపల్లి, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Updated Date - 2022-05-19T08:10:23+05:30 IST