పోలీస్ ఉద్యోగాల సాధనలో నేడు సెమీఫైనల్
ABN, First Publish Date - 2022-12-07T23:40:15+05:30
పోలీస్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కీలకమైన దేహదారుఢ్య పరీక్షల(ఈవెంట్స్) నిర్వహణకు రాష్ట్ర ప్రభు త్వం అన్నిచర్యలు చేపట్టింది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మొత్తం 26,433 మంది అభ్యర్థులు ఈ ఈవెంట్స్‌కు హాజరుకానున్నారు.
నేటి నుంచి జనవరి 4 వరకు ఫిజికల్ ఈవెంట్స్
నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 7 : పోలీస్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కీలకమైన దేహదారుఢ్య పరీక్షల(ఈవెంట్స్) నిర్వహణకు రాష్ట్ర ప్రభు త్వం అన్నిచర్యలు చేపట్టింది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మొత్తం 26,433 మంది అభ్యర్థులు ఈ ఈవెంట్స్‌కు హాజరుకానున్నారు. వీరిలో 4,830 మంది మహిళలు ఉన్నా రు. రోజుకు 1,200మంది చొప్పున ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 5గంటల నుం చి ఈవెంట్స్ ప్రారంభమవుతాయి. మహిళా అభ్యర్థులకు ఈ నెల 10 నుంచి 14 వరకు ఈవెంట్స్ ఉంటా యి. పురుషులకు 1600 మీటర్ల పరుగుపందెం, మహిళలకు 800 మీటర్ల పరుగుపందెం ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రతి ఈవెంట్ వద్ద హైదరాబాద్‌లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు, ఇతర అధికారులు పర్యవేక్షకులుగా ఉండనున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఈవెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు వాటిని అ నుసంధానిస్తారు. ప్రధానం గా మూడు రకాల ఈవెం ట్స్ రన్నింగ్, లాంగ్‌జంప్, హైజం్పలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
మొదటి ఈవెంట్లో అర్హత సాధిస్తేనే..
అభ్యర్థులకు బయోమెట్రిక్ పూర్తయ్యాక ఆర్‌ఎ్‌ఫఐడీ(ఐడీ నెంబరు) కుడిచేతి మనికట్టు కు హాల్‌టికెట్‌తో కూడిన వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేసి బార్‌కోడ్‌తో రిస్ట్‌బ్యాండ్ వేసి కంప్యూటర్లో స్కానింగ్‌చేసి రన్నింగ్ ఈవెంట్‌కు పంపిస్తారు. రన్నింగ్ పర్యవేక్షణ కోసం జాకెట్ వేసి సెన్సార్ ద్వారా టైంను గుర్తించి ఫలితాల కాపీని అందిస్తారు. రన్నింగ్ ఈవెంట్లో అర్హత సాధించిన వారిని ఎత్తు కొలిచే పాయింట్‌కు పంపిస్తారు. ఎత్తును కొలిచి డిస్ప్లే చేసి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. ఎత్తులో అర్హత సాధించిన వారిని షాట్‌పుట్ ఈవెంట్‌కు అక్కడ అర్హత సాధిస్తే లాంగ్‌జంప్ ఈవెంట్‌కు పంపిస్తారు. మూడు ఈవెంట్లలో అర్హత పొందిన వారిని ఫైనల్ రిజల్ట్ పాయింట్ వద్దకు పంపి అథెంటిక్ రిజల్ట్ కాపీని అందిస్తారు. ఇలా ప్రతి ఈవెంట్లో అథెంటిక్ వెరిఫికేషన్ ఉంటుంది. మొదటి ఈవెంట్లో అర్హత సాధించకుంటే మిగతా వాటికి అనర్హులు. మైదానంలో ప్రతి అయిదుగురికి రన్నింగ్ ఈవెంట్ నిర్వహిస్తారు. ప్రతి 5 నిమిషలు ఒక బ్యాచ్‌ను పంపిస్తారు.
ముందుగా సర్టిఫికెట్ల పరిశీలన
ఈవెంట్స్‌కు వచ్చే అభ్యర్థులు హాల్‌టికెట్ (పార్టు-2 దరఖాస్తు ప్రింట్, స్టడీ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రాలను, మైదానంలోకి వచ్చే గేటు వద్ద కంప్యూటర్ ద్వారా పరిశీలించి, పంపిస్తారు. స్టేడియంలోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను కౌంటర్ వద్ద పరిశీలిస్తారు. ఆ తర్వాత బయోమెట్రిక్ (వేలిముద్రలు) తీసుకుంటారు. అభ్యర్థులు చేతి వేళ్లపై మెహందీ, పచ్చబొట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
పాటించాల్సిన సూచనలు
పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి జారీ చేసిన అనుమతి లేదా సమాచార పత్రం (అడ్మిట్‌కార్డు) తమ వెంట తీసుకురావాలి.
అభ్యర్థి స్వీయ సంతకంతో కూడిన పార్టు-2 అప్లికేషన్ ఫాం, స్వీయ సంతకాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలి.
నిర్ధేశించిన తేదీల్లోనే శారీరక దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలి.
పరీక్ష నిర్వహణ కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత అన్నిరకాల పరీక్షలు ముగిసిన తర్వా తే బయటకు అనుమతిస్తారు. అభ్యర్థులు తగి న విధంగా సంసిద్ధులై రావాలి.
అభ్యర్థులు తమ వెంట దుస్తులు, ఆహార పానియాలు వంటి అత్యవసరమైనవి మినహా ఎటువంటి విలువైన లేదా నిషేధిత వస్తువుల కు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు. ప్రతి ఈవెంట్ పరిశీలన కేంద్రం వద్ద ఓర్పుతో క్యూ పద్ధతిని పాటించాలి.
సెల్ఫోన్లు, ఎటువంటి ఎలకా్ట్రనిక్ వస్తువులు అనుమతించబడదు.
మహిళా అభ్యర్థులు తమ వాస్తవిక ఎత్తును ప్రభావితం చేయు ఎలాంటి అభ్యంతరకర శిరోజాలం, గాజులు ధరించి పరీక్షకు హాజరుకాకూడదు.
బయెమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున చేతివేళ్లకు గోరింటాకు, ఇతర రంగులు వేసుకుని రాకూడదు.
పరీక్ష నిర్వహణలో ప్రతి అభ్యర్థి అధికార సూచనలు పాటిస్తూ సహకరించాలి.
అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి : ఎస్పీ
సూర్యాపేటక్రైం : ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలన్నారు. ఇతరులు చెప్పే మాయమాటలను అభ్యర్థులు నమ్మవద్దని, పరీక్ష లు పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. ప్రతి బ్యాచ్ ఎంపిక సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంద న్నారు. దీన్ని భద్రపర్చి భవిష్యత్తులో ఏమైనా విమర్శలు వస్తే ఆ ఫుటేజ్‌ల ద్వారా విచారణ చేపడతారని తెలిపారు.
Updated Date - 2022-12-07T23:40:20+05:30 IST