ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm kcr సీఎం కేసీఆర్ ను కలిసిన పర్యావరణవేత్త తిమ్మక్కTimmakka

ABN, First Publish Date - 2022-05-18T23:45:33+05:30

కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క(timmakka) బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును(kcr) మర్యాదపూర్వకంగా కలిశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క(timmakka) బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును(kcr) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కేసీఆర్ తాను నిర్వహిస్తున్నసమీక్ష సమావేశానికి స్వయంగా తీసుకుని వెళ్లి పద్మశ్రీ తిమ్మక్కను మంత్రులు, ప్రజా ప్రతినిధులకు పరిచయం చేశారు.


వారందరి సమక్షంలో కేసీఆర్ ఆమెను సత్కరించి, మెమెంటోను అందజేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ఎంతో కష్టపడుతున్నారని పద్మశ్రీ తిమ్మక్క అన్నారు.కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీతదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క సీఎంకు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క పడుతున్న తపన సమావేశంలో పాల్గొన్న వారిలో స్పూర్తిని నింపింది. 

Updated Date - 2022-05-18T23:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising