ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-09-19T08:35:53+05:30

రుణ బాధలు రైతుల ఉసురుతీస్తున్నాయి. పంట కోసం దొరికిన చోట అప్పుచేసిన అన్నదాతలు దిగుబడి సరిగా రాక, అప్పు తీర్చే దారి తెలియక బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వనపర్తి జిల్లాలో బ్యాంకు ఒత్తిడితో..
  • రంగారెడ్డి జిల్లాలో పురుగుమందు 
  • తాగి దళిత రైతు బలవన్మరణం
  • ఆదిలాబాద్‌లో చెరువులో దూకి ఒకరు

గోపాల్‌పేట/తాంసి/తలకొండపల్లి, సెప్టెంబరు 18: రుణ బాధలు రైతుల ఉసురుతీస్తున్నాయి. పంట కోసం దొరికిన చోట అప్పుచేసిన అన్నదాతలు దిగుబడి సరిగా రాక, అప్పు తీర్చే దారి తెలియక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆదివారం వనపర్తి, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పురుగుల మందు తాగి మరణించగా, మరొకరు చెరువులో దూకి ప్రాణం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన నలువోతు రాములు (42)కి మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో వరి సాగు చేస్తున్నాడు. సాగు అవసరాల కోసం కృష్ణా బీమా సమృద్ధి బ్యాంకులో, ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. దీనికి తోడు మహిళా సంఘాల్లో భార్య పేరున రుణం తీసుకున్నాడు. మొత్తంగా అప్పు నాలుగు లక్షల రూపాయలు అయ్యింది. దీనికి వడ్డీల భారం పెరగడం, అప్పు తీర్చాలని బ్యాంకు నుంచి ఒత్తిడి అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


 ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన అల్లం అన్నారావు (47) అనే రైతు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడున్నర ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్న ఆయన.. రూ.4.5 లక్షల అప్పు చేయగా, తీర్చే స్థోమత లేక ఆదివారం ఉదయం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో చలిచీమల రాములు (46) అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాములుకు మూడెకరాల పొలం ఉంది. మూడు సంవత్సరాలుగా పంటల సాగుకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. దిగుబడులు రాకపోవడంతో కుదేలయ్యాడు. ఈ క్రమంలో శనివారం తన పొలం వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాములు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కాగా, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం అమరవరం గ్రామానికి చెందిన రైతు కర్నాటి వెంకట్‌రెడ్డి (48) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. 

Updated Date - 2022-09-19T08:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising