ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని గౌరవించాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-06T22:22:19+05:30

రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని గౌరవించాలని ఎమ్మెల్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ను పట్టించుకోవడం లేదంటే రాజ్యాంగాన్ని అగౌరవ పరిచినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్.. రాజ్యాంగ వ్యవస్థ అని ఆయన అన్నారు. గవర్నర్ నిర్వహించిన ఉగాది వేడుకులకు సీఎం, సీఎస్, డీజేపీలు కూడా హాజరు కాకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయన విమర్శించారు. 

 


వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో ఢిల్లీ సమావేశం బాగా జరిగిందన్నారు. తమ పార్టీ నేతలు ఎవరి అభిప్రాయాలను వారూ స్వేచ్ఛగా వ్యక్తపరిచారన్నారు. ఓరల్‌గా బాగా పనిచేయాలని తమకు రాహుల్ సూచించారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పర్యటన ఈ నెలాఖరు లో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వున్నా.. అవి బేధాభిప్రాయాలు కావని ఆయన అన్నారు. 

Updated Date - 2022-04-06T22:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising