ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లే..: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-10-17T09:36:37+05:30

బీజేపీకి ఓటు వేస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంట్రాక్టు కోసం పార్టీ మారిన వ్యక్తి మనకెందుకు?: గంగుల

చండూరు/సంస్థాన్‌ నారాయణపురం/నాంపల్లి, అక్టోబరు 16: బీజేపీకి ఓటు వేస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మతం పేరుతో ప్రజల్లో చిచ్చుపెడుతూ దేశంలో అల్లర్లకు పాల్పడే వారిని నమ్మొద్దన్నారు. నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకలిచావుల తెలంగాణను ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ అన్నపూర్ణగా మార్చారని కొనియాడారు. కాంగ్రె్‌సకు ఓటు వేస్తే పరోక్షంగా బీజేపీకి వేసినట్లేనని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీ నుంచి గెలిచి కాంట్రాక్టుల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మనకు అవసరమా అని రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. రైతురాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి చేతకాని తనం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని ఆయన అన్నారు. 

Updated Date - 2022-10-17T09:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising