ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ మారాలని పోలీసులతో బెదిరిస్తున్నారు

ABN, First Publish Date - 2022-10-17T09:35:28+05:30

తన చుట్టూ ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌ నేతలు సంతలో పశువుల్లా కొనుగోలు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారని మునుగోడు బీజేపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మా నేతలను కొని.. నన్ను ఒంటరిని చేశారు: రాజగోపాల్‌రెడ్డి

చండూరు, అక్టోబరు 16: తన చుట్టూ ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌ నేతలు సంతలో పశువుల్లా కొనుగోలు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారని మునుగోడు బీజేపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి చండూరు చౌరస్తాలో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్‌ఎ్‌సను నమ్మే పరిస్థితిలో లేరని, వారంతా బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని పోలీసులతో టీఆర్‌ఎస్‌ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్‌... తాను మూడేళ్లుగా అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడిగితే కనీసం స్పందించలేదన్నారు.


తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో పార్టీ ఫండ్‌ కావాలని అడిగితే కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలకు తాను కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశానన్నారు. ‘‘అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమా? మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఎందుకివ్వరు’’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపికి ప్రజలు పట్టం కడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పార్టీ మారితే తప్ప అభివృద్ది చేయలేరా అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-10-17T09:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising