కేసీఆర్‌లో జాతీయత, నిజాయితీ లేవు
ABN, First Publish Date - 2022-10-07T09:03:59+05:30
‘‘కేసీఆర్‌లో జాతీయత లేదు. నిజాయితీ లేదు. జాతీయ పార్టీగా మారే అవకాశం ఉన్నంత మాత్రాన అది జాతీయ పార్టీ కాదు.
ఆంధ్ర ప్రజలు ఆయనను గౌరవించరు: అశోక్‌బాబు
అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): ‘‘కేసీఆర్‌లో జాతీయత లేదు. నిజాయితీ లేదు. జాతీయ పార్టీగా మారే అవకాశం ఉన్నంత మాత్రాన అది జాతీయ పార్టీ కాదు. కుమార్‌స్వామి సహా ఏ ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎ్‌సలో విలీనానికి ఒప్పుకోలేదు. అప్పుడు అది జాతీయ పార్టీ ఎలాగవుతుంది?’’ అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు. ‘‘కేసీఆర్‌లో జాతీయవాదం ఉందో లేదో కానీ నిజాయితీ మాత్రం లేదు. కాంగ్రె్‌సతో అది రుజువైంది. తెలంగాణ వస్తే ఎస్సీని సీఎం చేస్తానన్న కేసీఆర్ తానే సీఎం అవ్వలేదా? కేసీఆర్‌ను ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో కానీ, ఏపీని విడదీసి, ఆర్ధికంగా దెబ్బతీసి, ద్వితీయ శ్రేణి రాష్ట్రం అన్నందుకు ఇక్కడి ప్రజలు మాత్రం గౌరవించరు’’ అని అశోక్‌బాబు అన్నారు.
Updated Date - 2022-10-07T09:03:59+05:30 IST