ఉపాధి లేదని... అప్పులే మిగిలాయని...
ABN, First Publish Date - 2022-12-16T03:00:43+05:30
ఎడపల్లి, డిసెంబరు 15: ఉపాధి కరువైందని.. అప్పులు మిగిలాయనే ఆవేదనతో ఓ వ్యక్తి, తన భార్యాపిల్లలకు పురుగుల మం దు ఇచ్చి తానూ తాగాడు! ఈ ఘటనలో అతడు మృతిచెందగా భార్య చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు పిల్లలకు ప్రాణాపాయం
వ్యక్తి ఆవేదన.. భార్య, ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషం
ఆపై తానూ తాగిన వైనం.. భర్త మృతి, భార్య విషమం
పిల్లలకు తప్పిన ప్రాణాపాయం.. నిజామాబాద్ జిల్లాలో ఘటన
ఎడపల్లి, డిసెంబరు 15: ఉపాధి కరువైందని.. అప్పులు మిగిలాయనే ఆవేదనతో ఓ వ్యక్తి, తన భార్యాపిల్లలకు పురుగుల మం దు ఇచ్చి తానూ తాగాడు! ఈ ఘటనలో అతడు మృతిచెందగా భార్య చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎడపల్లి మండలం జానకంపేట్‌కుచెందిన సాయిలు (36)కు భార్య రేఖ, చరణ్, అరుణ్ కుమారులున్నారు. సాయిలు, రేఖ కూలీ పనులకు వెళుతుంటారు. కరోనా నుంచి సాయిలుకు కష్టాలు చుట్టుముట్టాయి. పనులు సరిగా లేకపోవడంతో పూటగడవడమే కష్టమైంది. ఏడాదిన్నర క్రితం ఉపాధి కోసమని సాయిలు దుబాయికి వెళ్లాడు. ఇందుకోసం బంధువుల వద్ద రూ.4లక్షల వరకు అప్పు చేశాడు. అయితే అక్కడ కూడా సరిగ్గా పని లేకపోవడంతో వెంటనే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఓవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం.. మరోవైపు అప్పులిచ్చిన వారు తీర్చాలంటూ ఒత్తిడి చేయడం.. అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటం సాయిలును మనోవేదనకు గురిచేసింది. బుధవారం అర్ధరాత్రి తనింట్లోనే కూల్‌డ్రింక్‌లో పు రుగుల మందు కలిపి భార్యా పిల్లలకు తాగించాడు. అనంతరం తానూ తాగా డు. స్థానికులు నలుగురినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ సాయిలు మృతి చెందాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కుమారులు చరణ్, అరుణ్ పరిస్థితి నిలకడగా ఉంది.
Updated Date - 2022-12-16T03:00:44+05:30 IST