ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల ఘటనపై కేంద్రం విచారణకు ఆదేశం

ABN, First Publish Date - 2022-09-14T18:13:55+05:30

సికింద్రాబాద్‌లోని రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన కేంద్ర రవాణాశాఖ వాస్తవాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ఈరోజు ఈ బైక్ పేలుళ్లపై విచారణ జరుగనుంది. బ్యాటరీలు ఎందుకు పేలాయి.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అనే కోణంలో విచారణ జరుగనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ బైక్ బ్యాటరీలు పేలిన ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసింది. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.


కాగా.. సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో ఈనెల 12న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎనిమిది మంది సజీవదహనం అవగా... మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 25 మంది బస చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-09-14T18:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising