ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిట్‌కు పూర్తి అధికారం ఉంది

ABN, First Publish Date - 2022-12-16T02:48:37+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన రిట్‌ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ కేసు అక్టోబరు 26న నమోదు కాగా మరుసటి రోజే దర్యాప్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టులో అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు..

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన రిట్‌ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ కేసు అక్టోబరు 26న నమోదు కాగా మరుసటి రోజే దర్యాప్తు దురుద్దేశంతో, కక్షపూరితంగా సాగుతున్నదని.. సీబీఐకి బదిలీ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే తరహాలో కేసులో మొదటి ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీ, ప్రతిపాదిత నిందితులు భూసారపు శ్రీనివాస్‌, తుషార్‌ కూడా పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ఏకసభ్య ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. సిట్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) కింద పెట్టిన కేసును విచారించే అధికారం సిట్‌కు కల్పిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఈ ఒక్క కేసును జీవో ద్వారా సిట్‌కు అప్పగించారని, ఈ నేపథ్యంలో పాత జీవోలను సవరించాల్సిన అవసరం లేదని తెలిపారు. సిట్‌కు పరిధి లేదనే వాదన దర్యాప్తును అడ్డుకునేందుకు తెచ్చిందే తప్ప మరోటి కాదని పేర్కొన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ప్రస్తుత కేసును ఏసీబీ మాత్రమే దర్యా ప్తు చేయాలని ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై సిట్‌కు అధికారం కల్పిస్తూ జీవో ఇచ్చాక ఏసీబీ దర్యాప్తు అవసరం లేదని ఏజీ సమాధానం ఇచ్చారు. సీబీసీఐడీ, సీసీఎస్‌ తరహాలోనే ఏసీబీ ఒక ఏజెన్సీ మాత్రమేనని.. కేసును ఎవరికి అప్పగించాలనేది ప్రభుత్వ విచక్షణ అని పేర్కొన్నారు. ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ అడ్డుపడుతున్నదని, ప్రతి దశలో కేసులు వేస్తూ దర్యాప్తు ముందుకు సాగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2022-12-16T02:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising