ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచార ఘటనపై ఆగని ఆందోళనలు

ABN, First Publish Date - 2022-06-07T09:11:09+05:30

జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిం చాలని బీజేవైఎం నేతలు డిమాండ్‌ చేశారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం వారు ఎంజే మార్కెట్‌ చౌ రస్తా వద్ద రాస్తారో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీబీఐకి ఇవ్వాలని బీజేవైఎం రాస్తారోకో

వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ రాజీనామా చేయాలని.. ఎన్‌ఎస్‌యూఐ, వైఎస్‌ఆర్‌టీపీ ఆందోళన

ఎమ్మెల్యే రఘునందన్‌ క్షమాపణ చెప్పాలని.. 

బీజేపీ ఆఫీసు ముందు ఎన్‌ఎస్‌యూఐ ధర్నా


అఫ్జల్‌గంజ్‌/మంగళ్‌హాట్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిం చాలని బీజేవైఎం నేతలు డిమాండ్‌ చేశారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం వారు ఎంజే మార్కెట్‌ చౌ రస్తా వద్ద రాస్తారోకో చేశారు. దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిం దితుల్లో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు ఉన్నందున.. తక్ష ణమే ఆయన చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ నేతల పిల్లలను తప్పించే ప్రయత్నం జరుగు తోందని ఆరోపించారు. అత్యాచారం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం నాయకులు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో చేశారు.  వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐలు వేరు వేరుగా వక్ఫ్‌ బోర్డ్‌ ముందు ఆందోళన నిర్వహించాయి. అత్యాచార బాధితురాలి ఫొటోలు, వీడియోలను విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేయా లని ఎన్‌ఎస్‌యూఐ నేతలు డిమాండ్‌ చేశారు.


బాధిత కుటుంబానికి ఎమ్మె ల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎన్‌ఎస్‌యూఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. దీంతో ఇరు పార్టీల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు వెంటనే ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-06-07T09:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising