ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,75,443

ABN, First Publish Date - 2022-09-17T09:13:44+05:30

రాష్ట్ర తలసరి ఆదాయం అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో పెరుగుదల నమోదువుతుండటంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌బీఐ నివేదిక 2021-22లో వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తలసరి ఆదాయం అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో పెరుగుదల నమోదువుతుండటంతో... అదే స్థాయిలో తలసరి ఆదాయం (పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌) కూడా పెరుగుతోంది. రాష్ట్రం అవతరించిన తొలినాళ్లలో... అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ.1,24,104గా ఉంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,75,443కు పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గురువారం ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2021-22’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంటే... ఈ ఏడేళ్ల కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 121.94 శాతం పెరిగినట్లయింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం 2014-15లో రూ.93,903 ఉండగా... 2021-22 నాటికి రూ.2,07,771కు పెరిగింది. ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 32.57 శాతం అధికం. ఇక జాతీయ స్థాయి సగటు తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నా... తెలంగాణ తలసరి ఆదాయం 83.62 శాతం అధికంగా నమోదైంది. 2021-22లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007గా ఉంది.

Updated Date - 2022-09-17T09:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising