ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆరుట్ల’ దంపతుల జీవితం స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2022-12-20T00:38:56+05:30

తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతుల జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోటకొండూరు, డిసెంబరు 19: తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతుల జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన ఆరుట్ల కమలాదేవి, రాంచంద్రారెడ్డి స్మారక క్రీడోత్సవాలు సోమవారం ముగిశాయి. పోటీలకు ఎనిమిది మండలాల నుంచి 800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. గెలిచిన క్రీడాకారులకు సీఈవో సీహెచ కృష్ణారెడ్డి, ఆరుట్ల సుశీలదేవి బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే పోటితత్వాన్ని అలవారచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ వడ్డెబోయిన శ్రీలత, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ప్రధానోపాధ్యాయులు రాఘురాంరెడ్డి, ఎంపీడీవో వీరస్వామి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా క్రీడల కార్యదర్శి స్టాలినబాబు, భూమండ్ల రవీందర్‌, పీఈటీలు మధు సుధన, వినోద్‌ కుమార్‌, కృష్ణమూర్తి, బాలకృష్ణ, రఘువీర్‌సింగ్‌, మల్లేష్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-20T00:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising