ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాప్‌ సినిమా డబ్బు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలి..

ABN, First Publish Date - 2022-01-15T08:36:23+05:30

తన ట్వీట్లు, కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శక నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్జీవీ వ్యంగ్యంగా వరుస ట్వీట్లు

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): తన ట్వీట్లు, కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శక నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ.. తెలుగు ప్రజలకు, సినిమా వాళ్లకు తనదైన శైలిలో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. శుక్రవారం ఆయన చేసిన వరుస ట్వీట్లు వైరలయ్యాయి. ‘సినీ నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కోరుకున్నట్టే టికెట్‌ ధరలు నిర్ణయించేలా, ప్లాప్‌ సినిమాలు తీసి పోగొట్టుకున్న డబ్బును.. ఏపీ ప్రభుత్వం వారికి ఇచ్చేలా చేయమని దేవుణ్ణి కోరుతున్నాను’ అని వర్మ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. చిన్న సినిమాలు ‘బాహుబలి’ కంటే పెద్ద హిట్టవ్వాలని ఆకాంక్షించారు. ‘దేవుడు మీ అందరికీ ముఖేశ్‌ అంబానీ కంటే ఎక్కువ డబ్బు, పెద్ద ఇల్లు ఇవ్వాలి. ఎలాంటి వైర్‌సలూ సోకకుండా చూడాలి. యువతీ యువకులకు అందమైన జీవిత భాగస్వాములు దొరకాలని కోరుకుంటున్నా’ అని మరో ట్వీట్‌ చేశారు. ‘తమ ప్రవర్తన ఎలా ఉన్నా భార్యలు బాధించకుండా ఓకే చెప్పాలనే భర్తల కోరికను దేవుడు తీర్చాలి’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘నన్ను ద్వేషించేవారికి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను త్వరగా చనిపోవాలని కోరుకునే వారి కోరికను దేవుడు మన్నిస్తాడని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.



Updated Date - 2022-01-15T08:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising