ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొచ్చిన మృత్యువు!

ABN, First Publish Date - 2022-09-26T08:29:52+05:30

ఆనందంగా సాగుతున్న వారి జీవన ప్రయాణం విషాదాంతమైంది. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే ఓ తండ్రికి కూతురు దూరమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘అనంత’లో రోడ్డుపక్క సేఫ్టీ గార్డును ఢీకొన్న కారు.. 
  • ముందు నుంచి వెనక్కి చొచ్చుకుపోయిన రేకు
  • ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం
  • మృతులు హైదరాబాద్‌ వాసులు

గార్లదిన్నె, సెప్టెంబరు 25: ఆనందంగా సాగుతున్న వారి జీవన ప్రయాణం విషాదాంతమైంది. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే ఓ తండ్రికి కూతురు దూరమైంది. వారాంతపు సెలవురోజున దైవదర్శనానికి వెళుతున్న కుటుంబంపై మృత్యువు పంజా విసిరింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి, ఐరన్‌ సేఫ్టీ గార్డును ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లో రామ్‌కోఠి ప్రాంతానికి చెందిన రఘువరన్‌ రాజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని భార్య జయంతి (42) అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నారు. వీరి ఇద్దరు పిల్లలు సంకీర్తన (10) ఏడు, సంకల్ప్‌ ఐదో తరగతి చదువుతున్నారు. వీరు శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి దేవాలయాన్ని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం కారులో హైదారాబాద్‌ నుంచి బయల్దేరారు. గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారు ఆదుపు తప్పి పక్కనే ఉన్న ఐరన్‌ సేఫ్టీ గార్డును ఢీకొంది. 


దీంతో గార్డు రేకు కారు ఎడమ భాగంలోకి చొచ్చుకుపోయి, వెనుక వైపు నుంచి బయటకు వచ్చింది. ఫలితంగా కారులో ఎడమవైపు ముందు, వెనుక సీట్లలో కూర్చున్న సంకీర్తన, జయంతి శరీరాల్లో నుంచి రేకు చొచ్చుకుపోగా.. చిన్నారి దేహం రెండు భాగాలుగా విడిపోయింది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న రఘువరన్‌ రాజు, ఆయన వెనుక సీటులో కూర్చున సంకల్ప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కళ్ల ముందే భార్య, కుమార్తె చనిపోవడంతో రఘువరణ్‌ రాజు భోరున విలపించాడు. గార్లదిన్నె ఎస్‌ఐ సాగర్‌, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని, పరిశీలించారు. క్రేన్‌, ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారును పక్కకు తీశారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


కుమార్తెల దినోత్సవం రోజే..: రఘువరన్‌ రాజుకు కూతురు అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజునే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి రెండు భాగాలుగా విడిపోయి రక్తపు మడుగులో పడిఉన్న కూతురు శరీరాన్ని చూసి ఆ తండ్రి విలవిల్లాడాడు. ‘అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ తండ్రీకొడుకులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది.

Updated Date - 2022-09-26T08:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising