బీజేపీపై వ్యతిరేక పోరాటం పెద్ద డ్రామా
ABN, First Publish Date - 2022-03-05T06:51:46+05:30
బీజేపీ వ్యతిరేక పోరాటమంటూ సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామా
- రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నారు: భట్టి విక్రమార్క
ఖమ్మం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): బీజేపీ వ్యతిరేక పోరాటమంటూ సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకొనే శక్తులను కేసీఆర్ కలుస్తున్నారని, అందులో భాగంగానే సుబ్రహ్మణ్యస్వామిని కలిశారన్నారు. బీజేపీపై వ్యతిరేకమంటూ కాంగ్రె్‌సకు నష్టం కలిగేలా ప్రయత్నిస్తున్నారని, దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన పీపుల్స్‌మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఆరో రోజైన శుక్రవారం ముదిగొండ మండలంలో బాణాపురం, వల్లభి, మల్లారం మీదుగా పాదయాత్ర సాగింది.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ 8ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, నిధులు, నీళ్లు,నియామకాల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ ప్రజా ఆకాంక్షలను పక్కకు పెట్టారని, అందుకే పీపుల్స్ మార్చ్ పేరుతో సమరయాత్ర సాగిస్తున్నానని పేర్కొన్నారు. రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5 వేలు ఇస్తూ, గిట్లుబాటు ధర చెల్లించకుండా రూ.30వేలు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని, ఇక బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. గీత కార్మికుల కోరిక మేరకు భట్టి కాసేపు సేదతీరి కల్లు రుచి చూశారు. పాదయాత్రలో కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్, పీసీసీ ఉపాధ్యక్షుడు వేంనరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బెల్లయ్యనాయక్, అన్వే్‌షరెడ్డి, భరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T06:51:46+05:30 IST