మెట్రోకు ఆర్థిక సాయం కోరిన తెలంగాణ:కేంద్రం
ABN, First Publish Date - 2022-12-16T00:36:33+05:30
హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్ నుంచి లకిడీకాపూల్ (26 కిమీ), నాగోల్ - ఎల్‌బీనగర్ (5కిమీ) మెట్రో కారిడార్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం కోరిందని కేంద్ర పట్టణాభివృద్ధి
హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్ నుంచి లకిడీకాపూల్ (26 కిమీ), నాగోల్ - ఎల్‌బీనగర్ (5కిమీ) మెట్రో కారిడార్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం కోరిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రూ.8,453 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు మెట్రో రైల్ విధానం 2017 ప్రకారం 50:50 నిష్పత్తిలో ఈక్విటీ వాటా పద్ధతిలో ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని పేర్కొన్నారు. కాగా, రూ. 6,105 కోట్ల వ్యయంతో శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయమై తమకు అవగాహన ఉందని తెలిపారు.
Updated Date - 2022-12-16T00:36:34+05:30 IST