ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రెంచి తెలుగు మహా నిఘంటువు తేవాలి

ABN, First Publish Date - 2022-01-14T21:14:38+05:30

ఫ్రెంచి, తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమి సిద్ధంగా ఉందని సుమారు 1500 పేజీలతో వెలువడనున్న ఈ గ్రంథానికి తెలంగాణ సాహిత్య అకాడమి సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తుందని చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫ్రెంచి, తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమి సిద్ధంగా ఉందని సుమారు 1500 పేజీలతో వెలువడనున్న ఈ గ్రంథానికి తెలంగాణ సాహిత్య అకాడమి సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తుందని చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. రవీంద్రభారతిలో ప్రొఫెసర్‌ డానియల్‌ నెజాక్స్‌ జూలూరుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వందల ఏళ్లుగా తెలుగు భాష, సంస్కృతులతో అనుబంధం కలిగి ఉన్న పారిస్ లో తెలుగు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలపైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని  ఫ్రెంచ్‌ రచయిత, తెలుగు అధ్యయనవేత్త  ప్రొఫెసర్‌ డానియల్‌ నెజాక్స్‌  తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్‌ను కోరారు. 


మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు భాషతో, తెలుగు ప్రజలతో  అనుబంధం కలిగి ఉన్న తాను పారిస్‌లో  తెలుగు పైన  ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని  భావిస్తున్నట్లు చెప్పారు. అది తన జీవితకాల కోరిక అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ పారిస్‌లో తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సంతోషదాయకమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలుగు – ఫ్రెంచి మహా నిఘంటు కోసం డానియల్‌ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా  అభినందించారు.

Updated Date - 2022-01-14T21:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising