ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతిభద్రతల పరిరక్షణలో..తెలంగాణ నంబర్‌ వన్‌: అలీ

ABN, First Publish Date - 2022-09-26T08:36:25+05:30

శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేశాం: హరీశ్‌రావు

జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 25: శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల కేంద్రంలో రూ.24 కోట్లతో నిర్మించిన పోలీస్‌ కాంప్లెక్సులో ఎస్సై క్వార్టర్‌, డాగ్‌ కన్నెల్‌, ఆఫీసర్స్‌ గెస్ట్‌హౌజ్‌, విశ్రాంతి బ్యారక్స్‌, ఇంటర్నల్‌ సీసీ రోడ్లు, ఆధునిక టెక్నాలజీతో యూపీఎస్‌ సిస్టం, సిబ్బంది క్వార్టర్స్‌, బీడీ టీం భవనాలను మంత్రి హరీశ్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారనే అపోహాను ప్రచారం చేశారని, కానీ ఎనిమిదేళ్లలో అంచనాలను తలకిందులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన చెప్పారు.  మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పోలీస్‌ వ్యవస్థను అన్ని విధాల పటిష్టం చేశామని, సిబ్బందిని నియమించామన్నారు. కొత్త మండలాల్లో పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి, ఫ్రేండ్లీ పోలీసింగ్‌కు కృషి చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-09-26T08:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising