ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు

ABN, First Publish Date - 2022-07-06T00:03:19+05:30

కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు రాశారు. ఏపీపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు రాశారు. ఏపీపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఏపీలోని రెండు ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం, అలాగే బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్ట్‌లు చేపట్టరాదని పేర్కొంది. 2 కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని తెలంగాణ పేర్కొంది. కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై మరో లేఖ కూడా రాసింది. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని లేఖలో కోరింది. తాగునీటి కోసం కాకుండా ఇతర అవసరాలకు తరలింపు సరికాదన్నారు. పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదని పేర్కొంది. అలాగే అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని తెలంగాణ కోరింది. 

Updated Date - 2022-07-06T00:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising