కామారెడ్డి జిల్లా నేతల సమీక్షలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-12-07T19:05:38+05:30
జిల్లా నేతల సమీక్షలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి: జిల్లా నేతల సమీక్షలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక, టిక్కెట్ల కేటాయింపు అధిష్టానం పరిధిలోనిదేనన్నారు. వ్యక్తి కోసం పనిచేసే వాళ్లకు పార్టీలో భవిష్యత్ ఉండదన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని.. లాబీయింగ్ చేసి టైం వృధా చేసుకోవద్దన్నారు. పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేసేవారికే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు.
Updated Date - 2022-12-07T19:05:40+05:30 IST