ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ కళాఖండం

ABN, First Publish Date - 2022-01-26T09:32:08+05:30

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్రానికి చెందిన కళాకారులు రూపొందించిన కళాఖండాన్ని ప్రదర్శించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్రానికి చెందిన కళాకారులు రూపొందించిన కళాఖండాన్ని ప్రదర్శించనున్నారు. నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రం నుంచి అన్నరపు నరేందర్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది కళాకారుల బృందం ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దింది. ఇందులో నిజాం నవాబు నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఎదుట లొంగిపోయిన సన్నివేశం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పొందుపరిచారు. ఈ కళాఖండం గణతంత్ర వేడుకల్లో నిర్వహించే ప్రదర్శనకు ఎంపికైనట్లు నరేందర్‌ తెలిపారు. ఈ కళాఖండం రూపకల్పనలో కళాకారులు పి.నరేశ్‌ కుమార్‌, కంది నర్సింహులు, గుర్రం మల్లేశ్‌, ఎ.వెంకటేశ్వర్లు, జి.శివకుమార్‌, జె.ప్రమోద్‌రెడ్డి, మహేశ్‌ పాల్గొన్నట్లు తెలిపారు.                -రాంనగర్‌ 

Updated Date - 2022-01-26T09:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising