ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దవాఖానాల్లో మందులుంటే.. బయటకు ఎందుకు రాస్తాం?’

ABN, First Publish Date - 2022-06-08T08:09:29+05:30

‘‘ప్రభుత్వ దవాఖానాల్లో మందులు ఉంటే.. బయటకు ఎందుకు రాస్తాం?’’ అని జూనియర్‌ డాక్టర్లు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆస్పత్రుల్లో మందు లు లేకుంటే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి

 తెలంగాణ జూనియర్‌ డాక్టర్లు


మంగళ్‌హాట్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ దవాఖానాల్లో మందులు ఉంటే.. బయటకు ఎందుకు రాస్తాం?’’ అని జూనియర్‌ డాక్టర్లు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆస్పత్రుల్లో మందు లు లేకుంటే.. వాటిని బయట కొనాలని రాయడం వైద్యుల తప్పెలా అవుతుందని, ఈ విషయంలో వైద్యులను బలిచే యడమేంటని నిలదీశారు. మంగళవారం కోఠిలోని ఐఎంఏ హాల్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభు త్వాస్పత్రులకు అత్యవసర మందులను సరఫరా చేయాల్సిన బాధ్యత పరిపాలన విభాగం అధికారులపై ఉంటుందన్నారు.


ఇటీవల కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్యులపై మంత్రి హరీశ్‌రావు చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. వైద్యులు అత్యవసర సమయంలో మాత్రమే రోగి ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశంతో మందులను బయటకు రాస్తుంటారని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల ప్రాంగణాల్లో కొనసాగుతున్న ప్రైవేటు మెడికల్‌ షాపులను వెంటనే తొలగించాలని జేఏసీ చైర్మన్‌ బొంగు రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జూనియర్‌ డాక్టర్ల ప్రతినిధులు, ఐఎంఏ అధ్యక్షుడు సంపత్‌, నాయకులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T08:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising