ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా తెలంగాణ

ABN, First Publish Date - 2022-05-17T10:38:38+05:30

గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుద్ధుడి బోధనలను స్మరించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం: కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుద్ధుడి బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పిన శాంతి, సహనం, అహింసా మార్గాలు నేటికీ అనుసరణీయమన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున నాగార్జున సాగర్‌లో ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనాన్ని ప్రభుత్వం ఇటీవల జాతికి అంకితం చేసిందని తెలిపారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లనుందన్నారు. సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనంలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుడి మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారు.


Updated Date - 2022-05-17T10:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising