ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congressలోకి చెరుకు సుధాకర్... పార్టీ కూడా విలీనం..!

ABN, First Publish Date - 2022-08-05T03:45:25+05:30

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ (Telangana inti party chief cheruku Sudhakar) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Pcc Cheif Revanth Reddy) అధ్యక్షతన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ (New Delhi): తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ (Telangana inti party chief cheruku Sudhakar) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Pcc Cheif Revanth Reddy) అధ్యక్షతన శుక్రవారం ఉదయం ఆయన కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోనునున్నారు. అదే సమయంలో తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యవహారంపై చర్చ జరుగుతుండగా.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి వచ్చే ప్రతి నాయకుడితో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకుంటున్నారు. 


ఇక మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా రేవంత్ కృషి చేస్తున్నారు. ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు నేతలు.. కాంగ్రెస్ గూటికి చేరగా తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.


ఇక చెరుకు సుధాకర్ రెడ్డి..  ఆగస్టు 31, 1961లో నల్గొండ జిల్లా గుండ్రంపల్లిలో జన్మించారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. 1997లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు చెరుకు సుధాకర్ టీఆర్ఎస్ పార్టీలో చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చెరుకు సుధాకర్.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 


Updated Date - 2022-08-05T03:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising