ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ts High Court: బండి సంజయ్‌ పాదయాత్రకు లైన్ క్లియర్

ABN, First Publish Date - 2022-08-25T23:05:43+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjai)‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామా యాత్రకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Ts High Court: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు (Praja Sangrama Yatra) ధర్మాసనం అనుమతి ఇచ్చింది. బండి సంజయ్ తన పాదయాత్రను ఆపాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మసనం.. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. పాదయాత్ర చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు రెడీ అయ్యారు. జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్ర చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన రాత్రికి పాంనూర్ చేరుకోనున్నారు. రెండు రోజులుగా నిలిచిన దూరాన్ని శుక్రవారం నుంచి ఆయన కవర్ చేయనున్నారు. 


కాగా బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో పాదయాత్ర చేశారు. తాజాగా జనగామ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన చేస్తున్న పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ నేపథ్యంలో పాదయాత్రను నిలిపి వేయాలని బండి సంజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 



Updated Date - 2022-08-25T23:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising