ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రోబోగైన్‌ ఇండియా 2022’ జాతీయ సదస్సును ప్రారంభించిన తమిళసై సౌందరరాజన్‌

ABN, First Publish Date - 2022-08-15T02:35:38+05:30

దేశంలోనే తొలిసారి రోబోటిక్‌ గైనకాలజికల్‌ సర్జరీపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ‘రోబోగైన్‌ ఇండియా 2022’ తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రోబోటిక్‌ గైనకాలజికల్‌ సర్జరీపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ‘రోబోగైన్‌ ఇండియా 2022’ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీలు చేసే వైద్యులతో ‘అసోసియేషన్‌ ఆఫ్‌ గైనకాలజికల్‌ రోబోటిక్‌ సర్జన్స్‌’ (ఏజీఆర్‌ఎస్‌) ఏర్పడింది. మినిమల్లీ ఇన్వాసివ్‌ కేర్‌, రోబోటిక్‌  అసిస్టెడ్‌ సర్జరీ (ఆర్‌ఏఎస్‌)లో ఇంట్యుటివ్‌ సర్జికల్‌‌తో భాగస్వామ్యం చేసుకుని దేశంలోనే తొలిసారి రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీపై ‘రోబోగైన్ ఇండియా’ పేరుతో జాతీయ  సదస్సు నిర్వహించింది. రెండు రోజులపాటు ఇది జరిగింది.


 గైనకాలజికల్‌ సమస్యలకు  చికిత్స చేయడంలో వచ్చిన తాజా సాంకేతికతలు, వాటి వినియోగంపై రెసిడెంట్స్‌తో పాటు సర్జన్లకు మెరుగైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా  దీనిని నిర్వహించారు.  రోబోటిక్‌ మియోమెక్టోమీ, మాలిగన్సీ కోసం రోబోటిక్‌ హిస్టెరెక్టోమీ, కాంప్లెక్స్‌ హిస్టెరెక్టమీ, ఎండోమెట్రియోసిస్‌ ఎక్స్‌సిషన్‌ , న్యూరోపెల్వియాలజీ పై మాస్టర్‌ క్లాస్‌ సెషన్‌లను నిర్వహించడంతో పాటు సవివరమైన కీనోట్స్‌, ప్యానెల్‌ చర్చాకార్యక్రమాలను రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ, దాని అప్లికేషన్స్‌, భవిష్యత్‌పై కీలకోపన్యాసాలు చేశారు.


రోబోగైన్‌ ఇండియా ఆర్గనైజింగ్‌ ఛైర్మన్‌, ఏజీఆర్‌ఎస్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌  డాక్టర్‌ రూమా సిన్హా  మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు ధన్యవాదాలు తెలిపారు.  రోబోటిక్‌ సర్జరీ  మహిళల జీవితాల్లో పెనుమార్పులను తీసుకురానుందన్నారు. ఆసుపత్రిలో ఉండే రోజులను ఇది తగ్గిస్తుందన్నారు. ఇంట్యుటివ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కంట్రీ జీఎం  మణ్‌దీప్‌ సింగ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రోబోగైన్‌ ఇండియా సదస్సు కోసం ఏజీఆర్‌ఎస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నట్టు చెప్పారు.  మన సర్జన్ల గైనకాలజిక్‌ శిక్షణ అవసరాలను తీర్చడానికి ఒక వ్యూహాన్ని రూపొందించామని, దాని ఫలితమే రోబోగైన్‌ ఇండియా అని  డాక్టర్‌ రూమా సిన్హా పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100 మంది సర్జన్లు, రెసిడెంట్లు హాజరయ్యారు. 

Updated Date - 2022-08-15T02:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising