ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: అటు విష్ణువర్ధన్ రెడ్డి.. ఇటు విజయారెడ్డి.. కాంగ్రెస్‌లో హీటు పుట్టిస్తున్న ఇంటర్నల్ రాజకీయం

ABN, First Publish Date - 2022-07-05T02:09:49+05:30

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో ఇంటర్నర్ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. జగ్గారెడ్డి వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో ఇంటర్నల్ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. జగ్గారెడ్డి వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అసమ్మతి వర్గం నేతలతో జూబ్లీహిల్స్ (JubileeHills) మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) మంగళవారం లంచ్ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా విష్ణువర్ధన్‌రెడ్డి అంటీముట్టనట్లు ఉంటున్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.


అయితే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి... విష్ణువర్ధన్ రెడ్డి సోదరి, ఖైరతాబాద్ సిట్టింగ్ కార్పొరేటర్ విజయారెడ్డి (Kairathabad Corporator Vijayareddy)ని పార్టీలోకి తీసుకున్నారు. అయితే పీజేఆర్ ఫ్యామిలీ(Pjr Family)లో విజయారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య కొంతకాలంగా దూరం పెరుగుతూ వచ్చింది. వారిద్దరి మధ్య మాటలు కూడా లేనట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో విజయారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల విష్ణువర్ధన్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా జాయిన్ చేసుకుంటారని విష్ణువర్థన్ రెడ్డి పార్టీ నేతలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క (Mla Batti Vikramarka)ను కలిసినప్పుడు కూడా విజయారెడ్డి అంశంపైనే మాట్లాడారట.  


మరోవైపు పి.విష్ణువర్ధన్ రెడ్డి.. టీఆర్ఎస్‎లో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‎తోనే ఉన్నట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది.  ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేస్తారని.. పార్టీ నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో విష్ణువర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లకపోవచ్చని ఆయన వర్గీయులనుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ ఉన్నారు. గోపినాథ్ టీఆర్ఎస్‌లో చాలా యాక్టివ్‎గా ఉండటం వల్ల ఆయనను కాదని టికెట్ ఇచ్చే  అవకాశం ఉండని విష్ణువర్ధన్ రెడ్డివర్గీయులు భావిస్తున్నారు.


అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు విష్ణువర్ధన్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిందని అనుచరులు తెలిపారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డిని వదులుకోమని అటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడి పార్టీలోనే కొనసాగిలా చేస్తామని చెబుతున్నారు.  మొత్తానికి మంగళవారం జరగబోయే సమావేశాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 



Updated Date - 2022-07-05T02:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising