ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: గవర్నర్ తమిళిసై నేతృత్వంలో జరగనున్న ‘ఎట్‌ హోమ్‌’కు సీఎం కేసీఆర్..

ABN, First Publish Date - 2022-08-15T22:58:27+05:30

తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) నేతృత్వంలో జరగనున్న ‘ఎట్‌ హోమ్‌’ (Raj Bhavan ‘At Home’) కార్యక్రమానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) నేతృత్వంలో జరగనున్న ‘ఎట్‌ హోమ్‌’ (Raj Bhavan ‘At Home’) కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Chief Minister KCR) హాజరుకానున్నారు. రాజ్‌భవన్‌లో (Raj Bhavan) రాత్రి 7 గంటలకు ‘ఎట్‌ హోమ్’ కార్యక్రమం మొదలుకానుంది. సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు ప్రగతి భవన్‌ (Pragathi Bhavan) నుంచి నుంచి సీఎం కేసీఆర్‌ (CM KCR) బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2021లో కరోనా కారణంగా ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరగలేదు. 2020లో జరిగిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారానికి గత జూన్ నెలలోనే ఫుల్‌స్టాప్ పడింది. తొమ్మిది నెలలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించారు.



ఇదిలా ఉండగా.. ఈ పరిణామం చోటు చేసుకున్న కొన్ని రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌ (CM KCR) జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళిసై హాజరయిన సందర్భంలో ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతోనే కేసీఆర్‌ పదే పదే ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారా.. అని విలేకరులు ప్రశ్నించగా ఆమె.. ‘ ఆ అవకాశం లేదు’ అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘నేను ప్రజా సేవకురాలిని. ప్రజలకు దగ్గరగా ఉండటం నా నైజం. గవర్నర్‌ అయినంత మాత్రాన రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నన్ను పోల్చవద్దు’ అన్నారు. ‘కేసీఆర్‌ ఎప్పుడూ నా సోదరుడే. నేను ఎప్పడూ ఆయనకు సోదరినే’ అని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకు సహృద్భావ వాతావరణమే ఉందని స్పష్టమవుతోంది.

Updated Date - 2022-08-15T22:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising