ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు Telangana కేబినెట్ అత్యవసర భేటీ

ABN, First Publish Date - 2022-01-16T15:42:52+05:30

తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యల కోసం రేపు(సోమవారం) కేబినెట్ అత్వసవరంగా భేటీకానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలను ప్రభుత్వం విధించే అవకాశం ఉంది. 


స్కూళ్లకు సెలవులు పొడిగింపు...

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండటంతో విద్యాసంస్థలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 8 నుంచి ఈరోజు వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వగా... ప్రస్తుతం వాటిని ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్  అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. 

Updated Date - 2022-01-16T15:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising