ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలి: రేవంత్

ABN, First Publish Date - 2022-01-16T00:18:18+05:30

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేసిన ఉపాధ్యాయ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగ బద్ధంగా ప్రగతి భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన టీచర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర చాలా కీలకమైందని, ఉద్యమంలో వారి పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల, ఉద్యోగులకు హక్కులకు భంగం కలిగించే 317 జీఓ వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. తెలుగు ప్రజలకు అత్యంత సంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి నాడు వారితో చర్చలు జరపకుండా అరెస్టులు చేయడం దారుణమన్నారు. 317 జీఓ రద్దు అయ్యే వరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-16T00:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising