ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: వినాయకులను ట్యాంక్బండ్లో నిమజ్జనం చేద్దాం: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-09-08T02:01:45+05:30

వినాయకులను ట్యాంక్బండ్ (Tankbund)లో నిమజ్జనం చేద్దాం. వినాయక నిమజ్జనం నాడు సద్దులు పట్టుకొని ట్యాంక్బండ్కు రండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘‘వినాయకులను ట్యాంక్బండ్ (Tankbund)లో నిమజ్జనం చేద్దాం. వినాయక నిమజ్జనం నాడు సద్దులు పట్టుకొని ట్యాంక్బండ్కు రండి’’ అని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు. ట్యాంక్బండ్పై బండి సంజయ్ పర్యటించి.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించారు. ప్రభుత్వ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జనం ఏర్పాట్లు చేయాల్సిన మంత్రి కేటీఆర్ (KTR) నాస్తికుడని విమర్శించారు. టీఆర్ఎస్ (TRS) నేతలు దారుసలాంలో సంబరాలు చేసుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. హుస్సేన్‌ సాగర్‌లో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని అధికారులు నిర్ణయించారు. ఒక్క ఖైరతాబాద్‌ వినాయకుడిని తప్ప ఏ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar)లో నిమజ్జనం చేయరు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌ సహా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలోని జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్(పీవోసీ) విగ్రహాలను నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే నీటికొలనుల్లోనే గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఉత్సవ నిర్వాహకులకు సూచిస్తున్నారు.

Updated Date - 2022-09-08T02:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising