ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్‌ జాం

ABN, First Publish Date - 2022-09-05T00:43:06+05:30

ట్యాంక్‌బండ్ (Tank Bund) పరిసరాల్లో భారీ ట్రాఫిక్‌ జాం (Traffic jam) అయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్ (Tank Bund) పరిసరాల్లో భారీ ట్రాఫిక్‌ జాం (Traffic jam) అయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట (Khairatabad Panjagutta), లక్డికాపూల్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట మార్గంలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచించారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఖైరతాబాద్‌ గణేశుడిని.. చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. స్వామి దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు ఎదురుచూస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని భక్తులు  (devotees) తెలిపారు. భక్తజనులతో ఖైరతాబాద్‌ గణపతి ప్రాంగణం పులకించిపోతోంది. తొలిరోజు వినాయకచవితి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఖైరతాబాద్‌ గణపతి వద్ద తొలి పూజను రాష్ట్ర గవర్నర్‌ గమిళిసై సౌందరరాజన్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించారు.


మహా నగరంలో మహా గణపతి కొలువుదీరాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల పూజలందుకుంటూ అలరిస్తున్నాడు. గ్రేటర్‌లో ఏ గల్లీలో చూసినా గణేశ్‌ మండపాలు కనిపిస్తున్నాయి. విభిన్న రూపాల్లో గణపయ్య దర్శనమిస్తున్నాడు. పురానాపూల్‌లో చాక్‌పీస్‌ రూపంలో, నాగులచింత లాల్‌ దర్వాజలో కాన్‌ గణేశుడిగా, బేగంబజార్‌ ఫీల్‌ఖానాలో పహిల్వాన్‌గా, కవాడిగూడలో కొబ్బరి‘కాయుడి’గా కొలువుదీరాడు. ఆయా మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

Updated Date - 2022-09-05T00:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising