ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

ABN, First Publish Date - 2022-06-10T21:40:50+05:30

రాజ్భవన్లో ‘మహిళా దర్బార్‌’ ముగిసింది. మహిళా దర్భార్‌లో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్భవన్లో ‘మహిళా దర్బార్‌’ ముగిసింది. మహిళా దర్భార్‌లో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని.. రాజ్భవన్ను గౌరవించాలన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని చెప్పారు. రాజ్భవన్నే గౌరవించకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని తప్పుబట్టారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని తమిళిసై ప్రశ్నించారు. 


రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనలు జరిగిన నేపథ్యంలో మహిళల సమస్యలు వినాలని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించారు. ఇందుకోసం రాజ్‌భవన్‌లో ‘మహిళా దర్బార్‌’ నిర్వహించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా దర్బార్‌ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగడం సంచలనాత్మకంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కొన్ని రోజులుగా మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే మరో రెండు అత్యాచార ఘటనలు చోటుచేసువడంతో రాష్ట్రంలో పరిస్థితి వేడెక్కింది. వాస్తవానికి జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నాలుగు రోజుల క్రితమే ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు. ఈమేరకు పోలీసులు ప్రాథమిక వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సమర్పించగా, ఆయన గవర్నర్‌కు నివేదించారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ఈనేపథ్యంలో వెలుగు చూడని ఘటనలు, ఇప్పటికే అన్యాయానికి గురైన యువతుల బాధలు వినాలని గవర్నర్‌ నిర్ణయించారు. ఇందులోభాగంగానే మహిళా దర్బార్‌ నిర్వహించారు.

Updated Date - 2022-06-10T21:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising